ట్విట్టర్ ట్రెండింగ్‌లో కేసీఆర్‌ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా…?

by Anukaran |   ( Updated:2021-09-05 05:04:17.0  )
kcr family twitter trending
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనే ధ్యేయంగా చేస్తోన్న ఉద్యమం రోజు రోజుకూ మరింత ఉధృతమవుతోంది. ఇదిగో.. నోటిఫికేషన్లు, అదిగో.. ఉద్యోగాలిస్తున్నాం అంటూ ప్రభుత్వ ప్రకటనలకు విసిగి వేసారి పోయామని, ఇక ప్రభుత్వంపై సమరమే మేలని ఉద్యమానికి దిగినట్లు నిరుద్యోగ యువత ట్విట్టర్ వేదికగా పోరాటం మొదలెట్టింది. అయితే తమ గోడును ప్రపంచానికి చాటే విధంగా నిరుద్యోగులు ట్విట్టర్‌లో క్యాంపెయిన్లు చేస్తున్నారు.

తాజాగా ఆదివారం నిరుద్యోగులంతా ఏకమై ఓ హాష్‌ట్యాగ్ ని నిర్ణయించుకొని సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇతర టీఆర్ఎస్ నాయకులను ట్యాగ్ చేస్తూ.. అందులో కొందరు కేసీఆర్ మాట్లాడిన వీడియోలను పెట్టి పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యలను ప్రపంచానికి చాటేలా జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి నిరుద్యోగి, గ్రాడ్యుయేట్ ట్వీట్ చేస్తూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేసి పోరాటాన్ని సక్సెస్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం నిరుద్యోగులు ‘‘#JobsOnly2KcrFamily’’ అనే హ్యష్ ట్యాగ్ తో చేస్తున్న ట్వీట్లు వైరల్ గా మారాయి..

అందులో ‘‘ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం అన్నప్పుడు మీఇంట్లో ఎందుకు అందరికీ ఉద్యోగ పదవులు ఇచ్చావు?? ’’, ‘‘ ఇంకెప్పుడు నోటిఫికేషన్లు వేసేది 9 నెలలు అవుతోంది. మాటతప్పితే తల నర్కుంటా అన్నావు ఏమైంది. @TelanganaCMO, @trspartyonline’’, ‘‘మాకు PRC రిపోర్ట్ ఆధారంగా 1.91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి ’’, ‘‘Where are you @GelluSrinuTRS??, Tell @TelanganaCMO @trspartyonline to release #JobNotifications before #HuzurabadByPoll .#Telangana People are realising now, @KTRTRS @trsharish #MatchBox your Games dont work all the time.’’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే క్యాంపెయిన్ మొదలైన పది నిమిషాల్లోనే వందల సంఖ్యలో పోస్ట్ లు చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed