సంతోష్‌బాబు కుటుంబానికి కేసీఆర్ పరామర్శ

by Shyam |
సంతోష్‌బాబు కుటుంబానికి కేసీఆర్ పరామర్శ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరిన సీఎం మధ్యాహ్నం 3.40గంటలకు సూర్యాపేట చేరుకున్నారు. విద్యానగర్‌లోని సంతోష్‌బాబు నివాసంలో చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5కోట్ల చెక్కు, నివాస స్థల పత్రాలను అందజేశారు. సీఎం కేసీఆర్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్, ఎస్పీ ఉన్నారు.

Advertisement

Next Story