ఫ్లాష్ ఫ్లాష్.. సభలో తడబడ్డ కేసీఆర్.. ప్రసంగానికి బ్రేక్

by Anukaran |   ( Updated:2021-08-15 01:22:30.0  )
ఫ్లాష్ ఫ్లాష్.. సభలో తడబడ్డ కేసీఆర్.. ప్రసంగానికి బ్రేక్
X

తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్​ స్వాతంత్ర వేడుకల్లో ప్రసంగం సందర్భంగా కొంత ఇబ్బందులు పడ్డారు. పదేపదే స్వల్ప దగ్గుతో ప్రసంగానికి బ్రేక్​ వేయాల్సి వచ్చింది. ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచే ఈ సమస్య వచ్చింది. దీంతో పలుమార్లు సీఎం చిన్నగా దగ్గుతో సవరించుకోవాల్సి వచ్చింది.

స్వాతంత్ర వేడుకల్లో సీఎం ప్రసంగం..

స్వాతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయని పేర్కొన్నారు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పెంచుతున్నామని, దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. అదే విధంగా యాదవులకు గొర్లు ఇచ్చామని, గొర్ల సంఖ్య పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక గొర్లు ఉన్న రాష్ట్రం మనదేనన్నారు. నాయిబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్​ అందిస్తున్నామని, ఆధునిక సెలూన్లు, దోబీఘాట్లను మంజూరు చేస్తున్నామన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఎర్ర తివాచీ పరుస్తున్నామని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. 17,671 పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, దీంతో 15.80 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం దూసుకుపోతోందని, కరోనా పరిస్థితులను తట్టుకుని ఐటీ రంగం నిలిచిందని, దీనికి ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed