సెంటిమెంటు సీఎం

by Ramesh Goud |
సెంటిమెంటు సీఎం
X

సెంటిమెంటుకు కేరాఫ్ సీఎం కేసీఆర్. సెంటిమెంటును కేసీఆర్‌ను వేరుగా చూడలేం. దానితో ముఖ్యమంత్రి నిరంతరం మమేకమవుతారు. రాజకీయ, పరిపాలనా వ్యూహ రచనలకూ మూలమూ అదే. జనాలనూ సెంటిమెంటులో ముంచెత్తుతారు! సింపుల్‌గా చెప్పాలంటే, ‘తెలంగాణ సెంటిమెంటు’కు బ్రాండ్ అంబాసిడర్! నమ్మకాలు, విశ్వాసాలు, సంప్రదాయాలకు నిలువెత్తు చిరునామా. మేడారం జాతరకు వెళ్లే భక్తుల్లో చాలా మంది ముందుగా వేములవాడ వెళతారు. రాజన్నను దర్సిస్తారు. కోడె మొక్కులు చెల్లిస్తారు. సేమ్ అట్లే, కేసీఆర్ కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యారు. ఏములాడ రాజేశుడిని గత డిసెంబరు 30న దర్శించుకన్నారు. ఈసారి మేడారం టూర్ ఉంటుంది కాబట్టే, వేములవాడకు వచ్చారని అపుడే గెస్ చేశారు. అది రియలైంది. ఇవాళ మేడారం వెళ్లారు. సమ్మక్క సారలమ్మ వన దేవతలకు ప్రణమిల్లారు. తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం), చీరె సారెలను ముట్టజెప్పారు. కోట్లాది భక్తుల కొంగు బంగారమైన అమ్మవార్లను కేసీఆర్ కోరుకున్న కోరికలేమిటో! తన అంతరంగాన్ని సీఎం ఒక పట్టాన ఎవరికీ అంతుబట్టనీయరు. అసలే కేటీఆర్‌కు ప్రమోషన్, తనకు నేషనల్ పాలిటిక్స్..టాక్ ఆఫ్ ద స్టేట్ అయిన నేపథ్యంలో సమ్మక్క సారలమ్మల సేవలో తరించారు. వేములవాడకు కుటుంబీకులతో కలిసి వెళ్లిన కేసీఆర్..తెలంగాణ కుంభమేళాకు మాత్రం సింగిల్‌గానే చేరుకున్నారు. కాకపోతే, వెంట ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు. మేడారం టు మెట్రో..సీఎం నేటి డౌరా!

Advertisement

Next Story