సాయంత్రం ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ

by Shyam |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పర్యటన ముగిసింది. ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా శ్రీరంగం ఆలయానికి వెళ్ళిన కేసీఆర్ మూడు రోజుల పాటు ఆ రాష్ట్రంలో ఉండి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబంతో సహా వెళ్ళిన ఆయన చెన్నైలో మంగళవారం సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యి గంటకు పైగా చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాల మొదలు కేంద్ర-రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలు, రాష్ట్రాల హక్కులపై కేంద్ర పెత్తనం, నదీ జలాల వివాదాలపై చర్చించారు. వచ్చే ఏడాది పునఃప్రారంభం కానున్న యాదాద్రి ఆలయానికి రావాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు.

ప్రగతి భవన్‌లో కొత్త ఎమ్మెల్సీల భేటీ

స్థానిక సంస్థల కోటాలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లోనూ గెలిచిన అభ్యర్థులు సీఎం కేసీఆర్‌తో సాయంత్రం భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. టికెట్లు ఇచ్చి ఎమ్మెల్సీలను చేసినందుకు థాంక్స్ చెప్పనున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ కార్యాలయం నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు సమాచారం వెళ్ళింది. అందరూ సాయంత్రానికి సీఎంను కలవనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన మధుసూదనాచారి సైతం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed