- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్రమత్తంగా ఉండండి.. ఒమిక్రాన్‌పై సీఎం కేసీఆర్ ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యాప్తి పెరగకుండా టీకా పంపిణీ వేగవంతం చేయాలని కోరారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు. సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో జరుగుతోంది. ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్‌మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడానికి అవసరమైన ఏర్పాట్ల సన్నద్దతపై కేబినెట్ చర్చించింది. దీనితో పాటు కరోనా నుంచి వచ్చిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ పరిస్థితిపై అధికారులు కేబినెట్ కి వివరించారు. దాన్ని ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వైద్యశాఖ పేర్కొంది.
రాష్ట్రంలోని అన్ని దవాఖానాలల్లోని పరిస్థితులను సమీక్షించాలని, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని కేసీఆర్ ఆదేశించారు.