కేసీఆర్ అంటే.. కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్

by Shyam |   ( Updated:2021-10-25 12:06:52.0  )
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. ఆదివారం హైటెక్సులో జరిగిన ప్లీనరీలో కేసీఆర్ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు అని నిర్వహించించారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ నుంచి ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణగా అనే స్థాయిలోకి తీసుకువెళ్లినం. దేశంలోనే అతిగొప్ప స్టార్టప్ తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం తెలంగాణలో ‘త్రీ ఐ’ సూత్రం పాటిస్తున్నాం. అంటే ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూసివ్ గ్రోత్‌ విభాగాలను అమలు చేస్తున్నాం అన్నారు. వీటిని దేశమంతా అమలు చేయగలిగితే ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించుకోవచ్చు అన్నారు.

హైదరాబాద్​గూగుల్‌కు గుండెకాయని పేర్కొన్నారు. గతంలో మన దగ్గర ఐటీ కంపెనీలు బ్యాకప్​ విధానంతో పనిచేస్తుండగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్యాక్​బోన్‌గా తయారయ్యాయి. అమెజాన్‌కు ఆయువుపట్టుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం అన్నారు. ఇదే విషయాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వానికీ తెలిపానని, కానీ అక్కడ్నుంచి పెద్దగా స్పందన లేదు. 95 శాతం ఉద్యోగాలు మనకు వచ్చేందుకే జోనల్​వ్యవస్థను తీసుకువచ్చాం. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామని కంపెనీలు అంటే కార్పొరెట్లే కాకుండా కులవృత్తులను కూడా స్టార్టప్‌లు తీర్చిదిద్దాం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed