మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనేలా చేస్తాను: బండి సంజయ్​

by Shyam |   ( Updated:2021-11-19 12:04:53.0  )
bandi sajay
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఇందుకు నిరసనగా సిరిసిల్లలో టవర్లెక్కిన రైతులపై టీఆర్ఎస్​నేతలు దాడులు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తాను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలిసేందుకు వెళ్తే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారన్నారు. రైతులను కలిసి తాను లేవనెత్తిన అంశాలే నేడు నిజమయ్యాయని పేర్కొన్నారు.

వర్షాలు వస్తే వడ్లు తడిచి రైతులు నష్టపోయే అవకాశముందని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పినా వినలేదన్నారు. ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌కు బాధ్యత లేదా అని మండిపడ్డారు. సిరిసిల్లలో నిరసన తెలిపేందుకు టవర్లెక్కిన రైతులపై రాళ్లు, కట్టెలతో దాడి చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్​తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్​చేశారు.

రైతులకు తాలు, తరుగు పేరుతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలని రైతుల వద్దకు వెళ్తే దాడులు చేశారని, ఇప్పుడు టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమొఖం పెట్టుకొని రైతుల ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పారాబాయిల్డ్ రైస్ కేంద్రం కొంటుందని నిరూపిస్తే తాను కూడా ఈ రాష్ట్రం నుంచి ధాన్యాన్ని కేంద్రం కొనేలా చేస్తానన్నారు. లేదంటే మొత్తం ధాన్యాన్ని రా రైస్‌గా కేంద్రానికి ఇస్తావా అని సవాల్​చేశారు. వానకు ధాన్యం తడిచి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బండి సంజయ్​డిమాండ్ చేశారు.

Advertisement

Next Story