- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ
దిశ, కొత్తకోట: రైతులను కేసీఆర్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. సాగునీటి ప్రాజెక్టులలో నిర్వాసితులైన రైతుల కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేస్తే దాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వక్రీకరిస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడన్నారు.
కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇస్తూ వ్యవసాయ ఆధారిత పరికరాల సబ్సిడీ నీ ఎత్తివేసి రైతులు ఇతర పంటలపై దృష్టి సారించకుండా చేశారన్నారు. ఏడు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు చేసిందేమీ లేదని పవన్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, మండల అధ్యక్షులు కోటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు కొమ్ము భరత్ భూషణ్, నారాయణమ్మ, మహిళా నాయకురాలు బాల మణెమ్మ .ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు సాయిరాం, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, విజయేంద్ర రెడ్డి, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.