దళిత ద్రోహి కేసీఆర్ : ఎండి ఎజాస్

by Shyam |   ( Updated:2021-07-29 08:37:57.0  )
congress leader
X

దిశ, పరిగి : తెలంగాణలో దళితులను మోసం చేసి గెలిచిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఎజాస్ ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొదట దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మొదటి మోసం చేశారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఏడు సంవత్సరాలు అయిందని, ఇప్పటివరకు ఏ దళితుడికి ఏ గ్రామంలో మూడెకరాల భూమి ఇవ్వకుండా రెండవ మోసం చేశాడన్నారు.

దళితులకు ఉద్యోగాలు ఇవ్వకుండ ఇప్పుడేమో దళిత బంధు అని కొత్త మోసం చేస్తున్నాడని విమర్శించారు. దళితుల మీద ప్రేమ ఉంటే వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పుడు హుజురాబాద్ లో ఎన్నికలు ఉన్నాయన్న ఉద్దేశ్యంతో దళిత బంధు ప్రకటించారన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed