ఆ తల్లిని కేసీఆర్ ఫామ్ హౌసులో దాచిపెట్టాడు : రేవంత్ రెడ్డి

by Anukaran |   ( Updated:2021-07-07 07:09:38.0  )
TPCC Revanth Reddy and Kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని మనం ఎవరం ప్రత్యక్షంగా చూడలేదు. మనకు తెలంగాణ ఇచ్చిన సోనియానే మనకు తెలంగాణ తల్లితో సమానమని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో సీతను ఎత్తుకెళ్లేందుకు రావణాసురుడు మారీచుడితో కలిసి మాయ లేడి రూపంలో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించారు.

సీతమ్మను లంకలో దాచిపెట్టినట్టే తెలంగాణ ప్రజలు పూజించే తెలంగాణ తల్లిని కేసీఆర్.. తన ఫామ్ హౌసులో దాచి పెట్టుకున్నారని ఆరోపించారు. మారీచుడు, రావణాసురుడు కలిస్తేనే కేసీఆర్ అని విమర్శలు చేశారు. లంకలో ఉన్న సీతను కాపాడేందుకు రాముడికి వానర సేన ఎలా సాయం చేసిందో.. టీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు వానర సేనలా పని చేయాలని కోరారు. ఇక విజయం మనదే అని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు తెలిపారు.

Read More: నిరుద్యోగంపై రేవంత్ ఫైర్.. దద్దరిల్లిన స్టేజ్

ఆయన మా పార్టీలో చేరడం సంతోషం : రేవంత్ రెడ్డి

Advertisement

Next Story