- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ దివ్యాంగులకు అన్యాయం చేశారు : ముత్తినేని వీరయ్య
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్దివ్యాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగుల సంక్షేమశాఖను స్త్రీ, శిశు సంక్షేమశాఖలో విలీనం చేసి వారి సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక ఎదుగుదలను అణగదొక్కి జీవితాలను సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చట్టాలను ఉల్లంఘించడం వ్యవస్థను అవమానించడమేనని ఆరోపించారు.
దళితులకు రూ.10 లక్షల స్కీమ్తెచ్చినట్లే.. వికలాంగుల చట్టం సెక్షన్ 37-బీ ప్రకారం అన్ని రకాల సంక్షేమ పథకాల్లో 5 శాతం, అలాగే సెక్షన్ 24-1 ప్రకారం సాధారణంగా ఇచ్చే లబ్ధిలో 25 శాతం అదనంగా పెంచి మొత్తం రూ.12,50,000 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేసీఆర్బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్విసిరారు. శుక్రవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడేళ్లలో సీఎం హోదాలో ఏనాడైనా వారు నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారా అని ప్రశ్నించారు.
దివ్యాంగుల దినోత్సవం రోజునే 20 మంది వికలాంగులను అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. తమ సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని లేదా తమనే ప్రగతి భవన్‌కు ఆహ్వానించి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తొలుత కేసీఆర్‌కు బహిరంగ లేఖను ఆయన పంపారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ వికలాంగుల విభాగం అధ్యక్షుడు దేశగాని సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.