- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి అన్ని విధాలా అండగా కేసీఆర్ ప్రభుత్వం.. గోరటి వెంకన్న
దిశ, లింగాల: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల సంరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయ కారుడు గోరటి వెంకన్న అన్నారు. బుధవారం లింగాల మండల కేంద్రంలో ఓ శుభకార్యంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యాస, భాష కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆంధ్ర పాలకుల పాలనలో కళాకారులను గుర్తించ లేదని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆవేదన, ఆత్మఘోష, అరణ్యరోదన, అంతులేని వివక్ష నుంచి తెలంగాణ ఉద్యమం ఉద్భవించిందని ఆయన తెలిపారు.
కళాకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌లను అందిస్తుందని తెలిపారు. మిగిలిన అర్హులైన కళాకారులకు పింఛన్లు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు రైతులకు వరంగా మారాయని గోరటి వెంకన్న కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, నల్లగొండ శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.