టీఆర్ఎస్‌ కు కేసీఆర్ ఫ్రెండ్ గుడ్ బై 

by Anukaran |
టీఆర్ఎస్‌ కు కేసీఆర్ ఫ్రెండ్ గుడ్ బై 
X

సిద్దిపేట టీఆర్ఎస్‌లో నాయకుల మధ్య విభేదాలు ఎక్కువవుతున్నాయి. పార్టీలో ఇమడలేక కొందరు నేతలు టీఆర్ఎస్‌కు దూరమవుతున్నారు. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక దగ్గరపడుతుండగా, మరో వైపు సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో పార్టీకి పలువురు నాయకులు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా చేసిన వారిలో సీఎం కేసీఆర్ స్నేహితుడు ఉండటం గమనార్హం.

దిశ ప్రతినిధి, మెదక్ : టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు నాయకులు రాజీనామాతో బహిర్గతమయ్యాయి. వచ్చే నెలలో దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, మరోవైపు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు సైతం దగ్గరలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బాలరాజు, వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ టీఆర్ఎస్ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ స్నేహితుగడు బాలరాజు పార్టీకి రాజనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

మొదటి నుంచి టీఆర్ఎస్‌కు సిద్దిపేట కంచుకోట. మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓ వెలుగు వెలుగుతున్నదని ప్రచారం. కానీ ఇదే సమయంలో పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు బాలరాజు, ప్రశాంత్ రాజీనామాతో బహిర్గతమయ్యాయి. తాను పార్టీలో ఇముడలేకపోతున్నామని చెబుతూ తన ప్రాథమిక సభ్యత్వానికి, తన వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాల్యాల ప్రశాంత్ ప్రకటించారు. తన కౌన్సిల్ పదవికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు సోమవారం దంజేశారు.

దుబ్బాక ప్రచారంలో ప్రతిపక్షాలకు బలం?

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న మంత్రి హరీశ్‌రావు ఇతర పార్టీలో ఉన్న అసమ్మతి నేతలని టీఆర్ఎస్‌లో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి తరుణంలో అధికార పార్టీలో కొనసాగుతున్న కౌన్సిలర్ రాజీనామా చేయడంతో నాయకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సీఎం కేసీఆర్ కు స్నేహితుడు, అత్యంత సన్నిహితంగా ఉంటే మ్యాలాల బాలరాజు సైతం పార్టీని వీడటం ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో ప్రతిపక్షాలకు బటం చేకూరినట్టుయింది. దీనికి అవకాశంగా తీసుకుని దుబ్బాక ఎన్నికలో వాడుకునే అవకాశం లేకపోలేదు.

త్వరలో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు…

టీఆర్ఎస్ లో నేతల మధ్య సమన్వయం నెమ్మదిగా దెబ్బతింటున్నాయి. అందుకు వీరి రాజీనామాలే సాక్ష్యం. గత మున్సిలల్ ఎన్నికల్లో 34 వార్డులకు గానూ 10 నుంచి 12 స్థానాలు మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. స్వతంత్ర, ఇతర పార్టీ నాయకులను మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్‌లో చేర్చుకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. మరి కొద్ది నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ని కొందరు నాయకులు వీడుతుండటంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ పడే అవకాశముంది. మరికొందరు నాయకులు సైతం తాము టీఆర్ఎస్ లో వేగలేమని, ఇందులో ఇమడలేకపోతున్నామని, త్వరలోనే పార్టీ వీడబోతున్నట్టు పార్టీ పెద్దలకు, మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం. మరి మంత్రి హరీశ్ రావు వారిని బుజ్జగిస్తారా? లేక సైలెంగా ఉంటారా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నాయకుల్లో మెదులుతున్నాయి. నాయకులు ఇలాగే పార్టీని వీడితే మున్సిపల్ ఎన్నికలో టీఆర్ఎస్ నష్టపోయే అవకాశం లేకపోలేదు.

Advertisement

Next Story