కరీంనగర్‌లో ఉద్రిక్తత.. బండి సంజయ్ దిష్టిబొమ్మను..

by Sridhar Babu |   ( Updated:2021-01-24 01:21:41.0  )
కరీంనగర్‌లో ఉద్రిక్తత.. బండి సంజయ్ దిష్టిబొమ్మను..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నడి బొడ్డును టీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీజేవైఎం కార్యకర్తలు కొట్లాడుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ ముష్టియుద్దానికి పాల్పడ్డారు. చివరకు పోలీసులు అడ్డుకున్నా వినకుండా ఒకరినొకరు నెట్టుకుంటూ పంచాయితీ పెట్టుకున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ యువమోర్చా నాయకులు దిష్టిబొమ్మ దగ్దాన్ని అడ్డుకున్నారు. దీంతో ఒకరునొకరు తోసుకుంటూ ముష్టి యుద్దానికి పాల్పడ్డారు. బందోబస్తు నిర్వహించేందుకు వచ్చిన కరీంనగర్ టూ టౌన్ సీఐ లక్ష్మీ బాబు వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మరింత మంది బలగాలు రంగంలోకి దిగి బీజేవైఎం, టీఆర్ఎస్వీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story