- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకాంగ్రెస్‌లో హుజూరాబాద్ గొడవ.. ఢిల్లీలో వాడివేడిగా చర్చలు..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో హుజూరాబాద్ బైపోల్ రిజల్ట్ కొత్త అనుమానాలకు దారి తీసింది. కేసీఆర్ ఓటమికి ఇదే తొలిమెట్టు అంటూ బీజేపీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తుండగా.. నైతిక విజయం మాదే అంటూ టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారు. కానీ, బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కవడంతోనే ఈటల గెలిచారంటూ రాష్ట్రంలో మొదలైన ప్రచారం చివరకు ఢిల్లీకి పాకింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం 3 వేల ఓట్లు రావడం అనేది ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అయింది. బీజేపీతో కలిసి పలువురు నాయకులు కుట్ర చేశారని ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టీకాంగ్రెస్ నేతలను హస్తినకు పిలిచి, ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతంపై చర్చించాలని పొన్నం ప్రభాకర్ కేసీ వేణుగోపాల్‌ను కోరినట్టు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో ఈటలను కాంగ్రెస్‌లోకి తీసుకుందాం అంటే పలువురు అడ్డుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపిస్తే.. వద్దని చెప్పింది మీరే కదా అంటూ కేసీ వేణుగోపాల్ బదులివ్వడం గమనార్హం. సొంత పార్టీల మధ్య సయోధ్య లేకపోవడమే ఇందుకు కారణమంటూ.. పలువురు టీఆర్ఎస్‌కు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, దామోదర, వి. హనుమంతరావు, షబ్బీర్ అలీ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంపై తనకు ఎటువంటి సమాచారం అందలేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పార్టీలో వర్గ పోరు మరోసారి చర్చకు దారి తీసింది.