- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్‌కు వెళ్తే అవకాశాలు బిస్కెట్: కౌశల్
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బ్రదర్, బిగ్ బాస్ ఇలా కార్యక్రమం పేరు ఏదైనా అందులో పార్టిసిపేట్ చేసి వచ్చాక అవకాశాలు బిస్కెట్ అవుతాయని బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా అంటున్నారు. బిగ్ బాస్ అయిపోయాక విన్నర్‌కు కానీ, రన్నర్‌కు కానీ, అలాగే అందులో పార్టిసిపేట్ చేసిన వారికి కానీ సినిమాలు, టీవీల్లో నటించే అవకాశాలు ఎందుకు తగ్గుతాయనే విషయం గురించి ఒక వీడియో ద్వారా ఆయన వివరించారు. అన్ని భాషల్లో బిగ్ బాస్ కార్యక్రమాలను చూస్తే ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ కెరీర్‌ను నాశనం చేసుకున్నవారే ఉన్నారని కౌశల్ తెలిపారు. అందుకు గల కారణాలను ఆయన చాలా లోతుగా విశ్లేషించి వివరించారు.
ఏదో అందరి దృష్టిలో పడి, టాలెంట్ ప్రూవ్ చేసుకుని పాపులర్ అయ్యి, అవకాశాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెడితే, బయటికి వచ్చాక కథ పూర్తిగా రివర్స్ అవుతుందని కౌశల్ అన్నారు. అందులో ఇచ్చే టాస్క్‌ల వల్ల వ్యక్తిగత స్వభావం గురించి అతిగా తెలియడం, ఎక్కువగా గొడవ పెట్టే టాస్క్‌లు తప్ప, టాలెంట్ చూపించే టాస్క్‌లు ఉండటం, బయట ఉన్న డైరెక్టర్‌లు, నిర్మాతలకు కంటెస్టంట్‌ల క్యారెక్టర్ తెలియడం వల్ల అవకాశాలు ఇవ్వడానికి ముందుకురారని కౌశల్ చెప్పాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఒక గర్వం పెరిగి డైరెక్టర్‌లు, నిర్మాతల దగ్గరికి అవకాశాల కోసం వెళ్లడం మానేయడం వల్ల కెరీర్ పూర్తిగా దెబ్బతింటుందని కౌశల్ వివరించాడు. అంతేగాకుండా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో బయట సీరియళ్లు, సినిమాల్లో తన స్థానాన్ని వేరే నటుడు రీప్లేస్ చేయడంతో పోటీ పెరిగి అవకాశాలు తగ్గుతాయని కౌశల్ కూలంకుషంగా వివరించాడు. కౌశల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్కువ పాపులారిటీ ఉన్న వాళ్ల కంటే తక్కువ పాపులారిటీ ఉన్నవాళ్లే బిగ్ బాస్‌కు వెళ్లడం మంచిదని విదితమవుతుంది. మరి ఏడేళ్ల పాటు తనకు పేరు, ప్రతిష్ట, డబ్బు తెచ్చిపెట్టిన కార్యక్రమాన్ని వదులుకొని బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన అవినాష్ పరిస్థితి బయటికి వచ్చాక ఎలా మారుతుందో చూడాలి మరి!