‘అవి కత్రినా కైఫ్‌ బుగ్గల్లా స్మూత్‌గా ఉండాలి’.. వివాదంలో ఇరుక్కున్న మంత్రి

by Anukaran |   ( Updated:2021-11-24 05:38:03.0  )
Katrina Kaifs cheeks
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మంత్రి సినీ తారలపై వివాదస్పద కామెంట్స్ చేశాడు. ప్రజల ముందు వారి పరువు తీశాడు. రోడ్లు ఆ హీరోయిన్లు బుగ్గల్లా స్మూత్‌గా నిర్మించాలని అధికారులకు ఆదేశాలు సైతం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా తన నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. తమ ప్రాంతంలో రోడ్లు హేమమాలిని చెంపల్లాగా స్మూత్‌గా ఉండాలి అని అధికారికి సూచించాడు. తర్వాత హేమమాలిని ఇప్పుడు వృద్ధురాలిగా మారిందని వ్యాఖ్యానించాడు. సమావేశానికి హాజరైన ప్రజలను ఇప్పుడు ఏ హీరోయిన్ ఎక్కువగా అలరిస్తుందని అడగగా.. వారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అని సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే మంత్రి.. రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లాగా స్మూత్‌‌గా ఉండాలని అధికారులకు సూచించాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతోపాటు మహిళలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed