- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కక్షతోనే కేసులు పెడుతున్నారు
దిశ, దుబ్బాక :
రాజకీయ కక్షతోనే తనపై కేసులు నమోదు చేస్తున్నారనీ, అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో తాను ఎవరినీ మోసం చేయలేదని దుబ్బాక స్వతంత్ర్య అభ్యర్థి కత్తి కార్తీక స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమిన్ పూర్‌లో 52 ఎకరాలకు సంబంధించి ఓ ఇష్యూలో కోటి రూపాయలను తీసుకుని మోసం చేసినట్టు ఆమెపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా ఆ కేసుపై ఆమె స్పందించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ….
ల్యాండ్ ఇష్యూలో సదరు వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు పంపించానని ఆమె తెలిపారు. మరి ఇప్పుడు పోలీసులు తనపై కేసు ఎలా నమోదు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను రాజకీయాలను వీడనని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు, 2023లో కూడా దుబ్బాక నుండి పోటీ చేస్తానని తెలిపారు. ఒక మహిళగా బహుజన బిడ్డగా దుబ్బాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వస్తే… తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆమె మండిపడింది.