నాగ్ అంటే క్రష్ : కస్తూరి

by Shyam |   ( Updated:2020-08-13 06:40:17.0  )
నాగ్ అంటే క్రష్ : కస్తూరి
X

టాలీవుడ్‌లో మన్మథుడుగా కీర్తించబడుతున్న అక్కినేని నాగార్జునకు.. వయసు పెరిగినా సరే, అందం ఏ మాత్రం తరగడం లేదు. కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌కు తండ్రి అయిన నాగ్.. వాళ్ల పక్కన నిల్చుంటే బ్రదర్‌లా కనిపిస్తాడే తప్ప, ఫాదర్‌లా అస్సలు కనిపించడు. 60 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న నాగ్ ఇప్పుడే ఇంత అందంగా ఉంటే.. 20, 30 ఏజ్‌లో ఎలా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి హ్యాండ్సమ్ హీరో నాగ్‌ను చూసి తాను ప్రేమలో పడిపోయానని తెలిపింది అలనాటి హీరోయిన్ కస్తూరి. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎంతో మంది హీరోలతో కలిసి పని చేసిన కస్తూరి.. నాగ్‌ను చూడగానే పడిపోయానని చెప్పింది. తనంటే క్రష్ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. ‘అన్నమయ్య, ఆకాశ వీధిలో’ సినిమాల్లో నాగ్‌తో కలిసి పనిచేసిన ఈ సీనియర్ హీరోయిన్.. నాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన రోజు, ఆ చేయిని ఎవరినీ ముట్టుకొనివ్వలేదని.. చేయి కడగకుండా అలాగే పడుకున్నానని చెప్పింది.

ఈ వీడియో క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నాగ్ ఫ్యాన్స్ ఈ వీడియోను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. కాగా, ప్రస్తుతం కస్తూరి సీరియల్స్‌‌తో బిజీగా ఉండగా.. తను చేస్తున్న గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది.

Advertisement

Next Story