మెగాస్టార్ ముందే మీసం మెలేసిన కార్తికేయ!

by Shyam |   ( Updated:2023-12-17 15:11:20.0  )
మెగాస్టార్ ముందే మీసం మెలేసిన కార్తికేయ!
X

యంగ్ హీరో కార్తికేయ ఆకాశంలో తేలిపోతున్నాడు. ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా రాని కిక్.. ఈ ఒక్క వీడియోతో వచ్చిందని మురిసిపోతున్నాడు. మరో లైఫ్ టైమ్ మెమొరీ కలిగిందని స్టెప్స్ కూడా వేస్తున్నాడు. కారణం.. తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడమే. అవును.. కానీ ఇదేదో సినిమాలో కాదు. కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో మాస్క్ ఆవశ్యకతను చెప్తూ చేసిన వీడియోలో చిరుతో కలిసి నటించాడు కార్తికేయ. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన కార్తికేయ.. షూటింగ్స్ మిస్ అవ్వడం, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో? అని భయపడటం అన్నీ ఈ ఒక్క వీడియోతో తీరిపోయాయని చెప్తున్నాడు

కాగా, ఈ వీడియోలో ముందుగా కార్తికేయ మీసం మెలేస్తూ కనిపించగా, అప్పుడే ఎంట్రీ ఇచ్చిన బాస్.. ‘మీసం మెలేయడం వీరత్వమే కానీ, ఇప్పుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం’ అని తన స్టైల్లో చెప్పగా.. ఎస్ బాస్! అంటూ మాస్క్ ధరిస్తాడు కార్తికేయ. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వీలైనన్ని సార్లు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ.. సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు చిరు. తద్వారా మన దేశాన్ని కాపాడాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed