కార్తీక్ ఆర్యన్ బర్త్‌డే ‘ధమాకా’

by Shyam |   ( Updated:2023-03-30 18:12:17.0  )
కార్తీక్ ఆర్యన్ బర్త్‌డే ‘ధమాకా’
X

దిశ, వెబ్‌డెస్క్ : బర్త్‌డే బాయ్ కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా ప్రకటించాడు. తన సినిమాలతో యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ పుట్టినరోజున.. కో స్టార్స్, ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ అందించగా, ఈ స్పెషల్ డే సందర్భంగా న్యూ మూవీ అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు కార్తీక్. ‘ధమాకా’ పేరుతో వస్తున్న సినిమాను డైరెక్ట్ చేస్తున్న రామ్ మాధవాని.. రోనీ స్క్రూవాలతో కలిసి నిర్మిస్తున్నారు. ధమాకా మోషన్ పోస్టర్‌లో బ్రిడ్జ్ కాలిపోతుండగా, సూట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్న కార్తీక్ ఆర్యన్.. ఓ బిల్డింగ్ గ్లాస్ నుంచి చూస్తున్నాడు. 2021లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా.. అదే ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

కాగా రామ్ మాధవన్.. సుస్మితా సేన్ లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఆర్య’ డైరెక్టర్. 2016లో వచ్చిన ‘నీర్జా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన.. తన నెక్స్ట్ సినిమా కోసం రోనీ స్క్రూవాలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

Next Story