డబుల్ రేప్: అక్కకు న్యాయం చేస్తానని చెల్లెలుపై కానిస్టేబుల్ అఘాయిత్యం

by Sumithra |   ( Updated:2021-09-29 23:44:00.0  )
డబుల్ రేప్: అక్కకు న్యాయం చేస్తానని చెల్లెలుపై కానిస్టేబుల్ అఘాయిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్: అతడో కానిస్టేబుల్.. పై అధికారులు చెప్పిన పని చేయడమే అతని పని.. కేసు విషయంలో బాధితుల ఇంటికి వెళ్లి కోర్టు పేపర్లను ఇవ్వడం, వారి వద్ద సమాచారాన్ని సేకరించడం లాంటివి చేయాలి. కానీ, ఇతను మాత్రం బాధితుల ఇంటి కూతురిపైనే కన్నేశాడు. అత్యాచారం కేసులో పెద్ద కూతురికి న్యాయం చేస్తానని చెప్పి చిన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భవతి కావడంతో అబార్షన్ చేయించుకో అంటూ డబ్బులు ముఖాన కొట్టాడు. దీంతో బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో కానిస్టేబుల్ రాసలీలలు వెలుగు చూశాయి. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకొంది.

వివరాలలోకి వెళితే.. దక్షిణ కన్నడ జిల్లాలో ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటి పెద్దకు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల పెద్ద కుమార్తెపై అత్యాచారం జరగడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు విషయమై సమన్లు, ఇతర కోర్టు పేపర్‌లను ఇచ్చేందుకు కానిస్టేబుల్‌ శివరాజ్‌ నాయక్‌ బాధితురాలి ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఈ క్రమంలోనే బాధిత మహిళ చెల్లిపై కన్నేశాడు. కోర్టు ప్రొసీడింగ్‌లు పూర్తయిన తర్వాత కూడా అతను ఏదో ఒక నెపంతో బాధితురాలి ఇంటికి వస్తూనే ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. దీంతో బాలిక గర్భవతి అయ్యింది.

గత కొన్ని రోజుల నుంచి బాలిక ముభావంగా ఉండడంతో ఏంటని తల్లిదండ్రులు నిలదీయగా.. విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెళ్లి కానిస్టేబుల్‌ని నిలదీయడంతో అతను పెళ్లికి నిరాకరిస్తూ ఆమెను అబార్షన్ చేయించుకోవాలని సూచించాడు. అందుకు ఖర్చుల కింద ఆ కుటుంబానికి రూ.35,000 ఇచ్చాడు. దీంతో తల్లిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. నాయక్ తమను బెదిరిస్తున్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాయక్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisement

Next Story