- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో కరోనా మృతదేహం బేరం.. కేసీఆర్‌కు కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ ట్వీట్!
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులు శవాలతో బేరం ఆడుతున్నాయి. కరోనా సమయంలో మానవత్వం కోణంలో ఆలోచించి వైద్యం అందించాల్సింది పోయి కరోనా మృతుల కుటుంబీకులకు మృతదేహం అప్పగించడానికి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే గానీ డెడ్ బాడీ అప్పగించేది లేదంటూ జలగల్లా మారి బాధిత కుటుంబాల రక్తం తాగుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల చీకటి కోణాలు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం 60కు పైగా హాస్పిటల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరికొన్నింటికి కొవిడ్ చికిత్స లైసెన్సు కూడా రద్దు చేసింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి శవ బేరం ఒకటి బయటకు వచ్చింది. కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందగా ఆస్పత్రి యాజమాన్యం మెడికల్ బిల్లును రూ.7.50 లక్షలుగా చూపించారు. ట్రీట్మెంట్ సమయంలో రోగి తరఫు బంధువులు రూ.2లక్షలు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లిస్తేగానీ డెడ్ బాడీ ఇచ్చేది లేదని మెడికవర్ ఆస్పత్రి వారు మృతుని బంధువులతో బేరం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్వీట్ చేశారు. కుటుంబానికి మృతదేహాన్ని అందించాలని ట్వీట్ ద్వారా కోరారు. డీకే శివకుమార్ సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్ఞప్తి గురించి తెలియడంతో మృతదేహాన్ని అప్పగించేందుకు మెడికవర్ ఆస్పత్రి అంగీకరించింది. తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలకు ఉపక్రమించిన తర్వాత కూడా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి రావడం ప్రభుత్వ పనితీరును, విశ్వసనీయతను మరోసారి బట్టబయలు చేసిందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.