- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
’విధ్వంసకారుల ఆస్తులు జప్తు చేస్తాం‘
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎమ్మెల్యే బంధువు చేసిన కామెంట్‌తో బెంగళూరులో మంగళవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆందోళన చేపట్టిన నిరసనకారుల్లో ముగ్గురు చనిపోవడంతో సర్వత్రా చర్ఛనీయాంశంగా మారింది. అటు పోలీసులపై కూడా దాడులు చేయడం గమనార్హం. అయితే, ఇప్పటికే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. పోస్ట్ చేసిన ఎమ్మెల్యే బంధువును కూడా అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. హింసలో పాల్గొన్న వారిని అందరినీ గుర్తించి వారి వారి ఆస్తులను జప్తు చేయిస్తామన్నారు. డీజే హాళ్లిలో జరిగిన హింసాత్మక ఘటనలో ఎస్డీపీఐ హస్తం ఉన్నదని ఆరోపించిన ఆయన.. దీనిపై కూడా నిషేధం విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 20 జరగబోయే క్యాబినెట్ భేటీలో ఈ రెండు అంశాలపై నిర్ణయం తీసుకుంటామని ఈశ్వరప్ప తేల్చి చెప్పారు.