ఐపీఎస్‌ అధికారి మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

by  |
ఐపీఎస్‌ అధికారి మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌
X

దిశ వెబ్‎డెస్క్: ప్రమాదవశాత్తు సర్వీస్ రివాల్వర్ పేలి, ఓ ఐపీఎస్ అధికారి మెడలోంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్పీశర్మ బెంగళూర్‌లోని కోత్నూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌ శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తు పేలి బుల్లెట్ మెడలోంచి దూసుకెళ్లింది.

గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు శర్మ లిఖితపూర్వకంగా తెలిపారని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ చెప్పారు. గన్ పొరపాటునే మిస్ ఫైర్ అయ్యినట్టు దర్యాప్తు బృందానికి సీపీ నివేదిక ఇచ్చారు.


Next Story

Most Viewed