కోవిడ్ -19 అలర్ట్ ఐడీ కార్డు రెడీ

by Sridhar Babu |
కోవిడ్ -19 అలర్ట్ ఐడీ కార్డు రెడీ
X

దిశ, కరీంనగర్ : కరోనా వైరస్ (కోవిడ్ 19)పై ప్రజలు స్వీయ అప్రమత్తత పొందాలనే ఆలోచన ఆ యువతిని వెంటాడింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ముందస్తు అప్రమత్తత ప్రతి ఒక్కరికి అవసరం అని గుర్తించి తనలోని మేథస్సుకు పదును పెట్టి మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌‌కు చెందిన బుదారపు స్నేహ. స్థానికంగా బీఎస్సీ చదువుతున్నారు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా పట్ల అన్ని వర్గాల ప్రజలు అవగాహన చేసుకునేందుకు కోవిడ్ 19 అలర్ట్ ఐడీ కార్డును తయారు చేశారు. ఈ కార్డును వెంట తీసుకుని బయట తిరిగేప్పుడు ‘సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే వెంటనే అప్రమత్తం చేస్తుంది. దీంతో సామాజిక దూరం పాటించేందుకు దోహదపడుతుంది. ఇందుకోసం పదిహేను రోజులు కష్టపడి అలర్డ్ ఐడీ కార్డును తయారు చేశారు. సెల్ఫ్ సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే విధానం బావుంటుందని భావించిన స్నేహ కోవిడ్ అలర్ట్ ఐడీ కార్డును రూపొందించారు. ప్రభుత్వం, ఈ ఐడీ కార్డును పరిశీలించి ప్రొత్సహిస్తే ప్రజలు సామాజిక దూరం పాటించే అవకాశం ఉంటుందని అంటున్నారు స్నేహ. ఇటీవలే స్నేహ కోవిడ్ 19 అలర్డ్ వాచ్‌ను కూడా తయారు చేశారు. పరిశుభ్రత లేకుండా చేతులను కళ్ల వద్దకు, నోటి వద్దకు తీసుకెళ్లినప్పుడు వెంటనే అలారం మోగుతుంది. తనను వెన్నుతట్టి ప్రొత్సహిస్తే సమాజా శ్రేయస్సు కోసం మరిన్ని పరికరాలు తయారు చేస్తానని అంటున్నారు స్నేహ.

Tags:Karimnagar,corona virus,covid 19,Allert,Id,student

Advertisement

Next Story

Most Viewed