- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైలో పసికందు కిడ్నాప్.. కరీంనగర్‌లో పట్టుకున్న పోలీసులు..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: సంతానం కలుగలేదన్న దంపతుల ఆవేదనను ఆసరా చేసుకున్న ఓ ఘనుడి నిర్వాకం రెండు రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించింది. ఓ వైపు టెక్నాలజీని ఉపయోగించగా.. మరోవైపు కూపీలాగిన పోలీసులు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. మహారాష్ట్ర పోలీసుల విచారణకు.. కరీంనగర్ ఖాకీలు తమవంతు చేయూతను అందించడంతో పసికందు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది.
సంఘటనా వివరాల్లోకి వెల్తే.. ముంబై ఏరియాలోని బాంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ దంపతులకు పుట్టిన 9 నెలల పసికందు ఇటీవల కిడ్నాప్‌కు గురయ్యాడు. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాంకేతికతను ఉపయోగించి కిడ్నాపర్లు కరీంనగర్ ప్రాంతానికి చెందినవారిగా అనుమానించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా సీపీ వి సత్యనారాయణకు సమాచారం అందించారు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో సహకరించాలని కోరారు. దీంతో కరీంనగర్ సీపీ టాస్క్ ఫోర్స్ టీమ్‌ను రంగంలోకి దింపి మహారాష్ట్ర పోలీసుల శ్రమను తగ్గించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రాంతానికి చెందిన కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని.. ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంతానం లేరన్న బాధతో..
జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రాంతానికి చెందిన ఓ దంపతులు తమకు పిల్లలు లేరన్న బాధతో పరిచయం ఉన్న స్థానిక కేబుల్ ఆపరేటర్‌తో చెప్పుకున్నారు. ఎన్ని డబ్బులయినా సరే కానీ, తమకు ఓ బాబు కావాలని అతడిని వేడుకున్నారు. దీంతో గతంలో ముంబైలో ఉపాధి కోసం వెళ్లి వచ్చిన సదరు కేబుల్ ఆపరేటర్ తనకు ఉన్న కాంటాక్టుల ద్వారా చాలా మందిని అడిగాడు. బాంద్రా ఏరియాలో ఉన్న ఓ టైలర్ ఆగస్టు 31న కేబుల్ ఆపరేటర్‌కు ఫోన్ చేసి బాబు అందుబాటులో ఉన్నాడని.. వెంటనే వచ్చి తీసుకెళ్లాలని సూచించాడు. ఇందుకు రూ. 3.15 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో కేబుల్ ఆపరేటర్ పిల్లలు లేని దంపతుల తాలూకు వారిని ప్రత్యేక వాహనంలో బాంద్రా ఏరియాకు తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం అక్కడకు చేరుకుని డీల్ అంతా సెట్ చేసుకుని 9 నెలల చిన్నారిని తీసుకుని వచ్చారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. చివరకు కరీంనగర్ పోలీసుల సాయంతో చిన్నారిని సేఫ్‌గా కాపాడగలిగారు.
అవసరమే ఇంత దూరం తీసుకొచ్చిందా..?
బుగ్గారం ప్రాంతానికి చెందిన దంపతులు పిల్లలు కావాలన్న కోరికను వెలిబుచ్చడం వల్లే 9 నెలల చిన్నారిని కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నారా లేక ముఠాగా ఏర్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్టు సమాచారం. కేబుల్ ఆపరేటర్ ముంబైలో ఉన్నప్పుడు ఉపాధి కోసం ఏం పని చేశాడు..? ఎలాంటి ముఠాలతో సంబంధాలు ఉన్నాయి.. అన్న కోణంలో విచారించే అవకాశాలు ఉన్నాయి.
నాలుగేళ్ల క్రితం..
దాదాపు నాలుగేళ్ల క్రితం కరీంనగర్ సమీపంలోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో కూడా పసికందును కిడ్నాప్ చేసిన వ్యవహారం కలకలం సృష్టించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కరీంనగర్ పోలీసులు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో 24 గంటల్లోనే కేసును ఛేదించారు. అప్పుడు కూడా కిడ్నాపర్లు జగిత్యాల ప్రాంతానికి చెందిన వారికే పసికందును విక్రయించేందుకు కిడ్నాప్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఆ తరువాత కూడా జగిత్యాల ప్రాంతంలో పిల్లలను విక్రయిస్తామంటూ తిరిగిన ముఠా గురించి వెలుగులోకి వచ్చింది. అసలు జగిత్యాల ప్రాంతంలోనే ఇలాంటి ముఠాలు సంచరించడం వెనక ఆంతర్యం ఏంటీ అన్న కోణంలో కూడా పోలీసులు కూపీ లాగాల్సిన అవసరం ఉంది.