ఈ దౌర్భాగ్య స్థితికి… ప్రభుత్వమే కారణం

by Shyam |   ( Updated:2020-08-25 06:17:25.0  )
ఈ దౌర్భాగ్య స్థితికి… ప్రభుత్వమే కారణం
X

దిశ, మునుగోడు: హిందూ పండుగలను కించపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి గ్రామంలో బీజేపీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు తల్లి మరణించటంతో వారి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి, సంతాపం తెలియజేశారు.

అనంతరం తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుండగా చౌటుప్పల్ బస్టాండ్ వద్ద ఆగి కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందూ సోదరులు పండుగలు చేసుకోవాలంటే కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును బట్టి పండగలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed