వివాదస్పదంగా ఉత్తర్వులు.. చిక్కుల్లో కరీంనగర్ డీఈవో

by Sridhar Babu |   ( Updated:2021-08-14 00:47:00.0  )
karimnagar
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, కొందరు ప్రభుత్వ అధికారులు అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా.. ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో నిర్వహించే ‘దళిత బంధు’ సభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ అధికారి టీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేయడం వివాదదాస్పదంగా మారింది. కాగా, ఇప్పటికే పలువురు అధికారులు, పోలీసులు బదిలీ అయిన విషయం తెలిసిందే.

ఉత్తర్వుల్లో.. విద్యాధికారులను జనసమీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పదిమంది స్పెషల్ ఆఫీసర్స్, 150 మంది రూట్ ఆఫీసర్స్‌ను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్స్‌గా ఎంఈవోలు, హెడ్ మాస్టర్లు, రూట్ ఆఫీసర్లుగా టీచర్లకు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed