- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా రెండో అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు : కరీనా
కపూర్‌ల ఇంట పుట్టిన కరిష్మా.. బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఒకానొక సమయంలో.. ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన కరిష్మాకు అవార్డులు కూడా వరుస కట్టాయి. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా, బ్యూటీ డాల్‌గా పేరొందిన కరిష్మా కపూర్ ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకుంది. కాగా ఈ అందాల తార గురువారం 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన ప్రియమైన చెల్లెలు కరీనా కపూర్‌తో పాటు కజిన్ రిద్దిమా కపూర్, హీరోయిన్లు మలైక అరోరా, అమృత అరోరా, సోనమ్ కపూర్‌లు ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు.
‘స్వచ్ఛమైన, విలువైన ప్రేమకు చిహ్నం.. నా సోదరి, నా రెండో అమ్మ, నా స్నేహితురాలు, నా సంతోషం.. హ్యాపీ బర్త్‌డే – లోలో. మన మార్నింగ్ ఫోన్ చాట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అంటూ కరీనా తన సిస్టర్ కరిష్మాకు విషెస్ తెలుపుతూ.. వాళ్లిద్దరి చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది.
ఈ సందర్భంగా కరిష్మా.. ‘నాపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ తెలిపింది. ఇదిలా ఉంటే.. కరిష్మా కపూర్ నటించిన తొలి సినిమా ‘ప్రేమ ఖైదీ’ మూడు రోజుల క్రితమే 29 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. కా తన తొలి చిత్రం.. సురేష్ ప్రొడక్షన్స్‌లోనే రావడం విశేషం.