- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కృతి సనన్ కాదు.. సీతగా కరీనా కపూర్ ఖాన్
దిశ, సినిమా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా కోసం కృతి సనన్ రూపంలో సీత దొరికేసింది. అయితే రామాయణం నేపథ్యంలోనే బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉండగా.. వీటిలో మధు మంతెన రామాయణ 3డి వెర్షన్ ఒకటి. కాగా ఇందులో హృతిక్ రోషన్ రాముడిగా కనిపించనుండగా.. సీతగా దీపికా పదుకునేను ఎంచుకున్నట్లు సమాచారం.
అయితే, లేటెస్ట్‌గా డైరెక్టర్ అలౌకిక్ దేశాయి ప్రకటించిన ‘సీత – ద ఇన్‌కర్నేషన్’లో సీత ఎవరు అనే దానిపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ‘బాహుబలి’ రచయిత కెవి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తుండగా.. డైరెక్టర్, రైటర్ ఇద్దరూ కూడా ఈ చిత్రానికి కరీనా కపూర్ ఖాన్‌ను సీతాదేవిగా ఎంచుకున్నారని సమాచారం. మిగతా రెండు ప్రాజెక్టుల్లా కాకుండా ‘సీత – ద ఇన్‌కర్నేషన్’ మూవీ సీత కోణంలో భిన్నంగా ఉంటుందని, ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంతో బెబోను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. కాగా టైటిల్ రోల్‌లో కనిపించనుండడంతో కరీనా కూడా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం కాల్షీట్స్, రెమ్యునరేషన్స్ గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం.