- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీనా ఇంట్లోనే పోడ్‌కాస్ట్ షూట్
దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ లేడీ బాస్ కరీనా కపూర్ ఖాన్.. ఈ మధ్యే ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది. మరికొన్ని నెలల్లో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న బెబో.. కొత్తగా ఎలాంటి సినిమా ప్రాజెక్ట్‌లకు సైన్ చేయలేదు. కానీ యాడ్ షూటింగ్స్‌కు మాత్రం ఓకే చెబుతోంది. కొవిడ్ కారణంగా బయటకు వెళ్లి ఇబ్బందులు పడటం ఎందుకని, ఇంట్లోనే షూటింగ్ జరిగేలా బ్రాండ్ కంపెనీలను ఒప్పించింది. ఈ క్రమంలో సిస్టర్ కరిష్మా కపూర్‌తో కలిసి ఓ అడ్వర్టైజ్‌మెంట్ కూడా కంప్లీట్ చేసింది.
బిడ్డ పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉండాలని ఎలాగూ డిసైడ్ అయిన కరీన.. తన థర్డ్ సీజన్ పోడ్‌కాస్ట్ పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుందని సమాచారం. ‘వాట్ ఉమెన్ వాంట్’ పోడ్‌కాస్ట్‌తో సక్సెస్ అందుకున్న తను.. థర్డ్ సీజన్ షూటింగ్ బాంద్రాలోని తన ఇంట్లోనే చేయాలని అనుకుంటుందట. ఈ షోలో పాల్గొనే గెస్ట్‌లు కూడా వర్చువల్‌గా షోలో పాల్గొంటారని.. లేదా తన ఇంటి దగ్గరికే వచ్చి కరీనాతో జాయిన్ అవుతారని తెలుస్తోంది. నెక్ట్స్ వీక్ ఎండింగ్ కల్లా గెస్ట్ లిస్ట్ ఫైనల్ కానుండగా.. 2020లో జరిగిన పాయింట్స్ గురించి అతిథులతో మాట్లాడనుందని తెలుస్తోంది. గత రెండు సీజన్ల షూటింగ్ ముంబై మెహబూబ్ స్టూడియోస్‌లో జరగగా.. సొసైటీ నెగ్లెక్ట్ చేయడం వల్ల మహిళల మీద ప్రభావం చూపే అంశాల గురించి చర్చించింది.