- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ చూసి షాక్ అవుతున్న పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నటి సౌజన్య తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. 25 ఏళ్ల సౌజన్య పలు కన్నడ సినిమాల్లో నటించడంతో పాటు గత కొంత కాలంగా టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. బెంగళూరులో అపార్ట్ మెంట్ లో ఒక ప్లాట్ లో ఉంటున్న సౌజన్య ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందింది. ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాల్సిన యువనటి అర్దాంతరంగా తనువు చాలించడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే సౌజన్య రాసిన సూసైడ్ నోట్ కీలకంగా మారింది
ఆ నోట్ లో ” నా చావుకు ఎవరు కారణం కాదు.. నేనే కావాలని చనిపోతున్నాను. గత కొంత కాలంగా నేను మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఎంతగా వాటి నుంచి బయటపడాలనుకున్నా.. నా వల్ల కావడం లేదు. నా చావు నా తల్లిదండ్రులకు బాధ కలిగించవచ్చు.. నన్ను క్షమించండి అమ్మానాన్న.. నాన్న.. అమ్మ, సోదరిని జాగ్రత్తగా చూసుకో” అంటూ రాసింది. ఇక ఈ కేసులో ఈ సూసైడ్ నోట్ కీలకంగా మారింది. ఈ వయస్సులో అంతటి మానసిక సమస్యలు ఏంటి..? అంతలా సౌజన్య కృంగిపోతున్నా ఇంట్లో ఎవరికి తెలియదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబాన్ని విచారించగా.. ఆమె మృతిపై తమకెటువంటి అనుమానాలు లేవని తెలపడం గమనార్హం. ఏదిఏమైనా అతిచిన్న వయస్సులో డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకోవడం అటు అభిమానులతో పాటు పోలీసులు కూడా షాక్ అవుతున్నారు.