బిగ్ బాస్ మళ్లీ మొదలు.. డీటెయిల్స్ హియర్

by Shyam |
బిగ్ బాస్ మళ్లీ మొదలు.. డీటెయిల్స్ హియర్
X

దిశ, సినిమా : కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 మళ్లీ షురూ కాబోతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన రియాలిటీ షో‌.. ఈ నెల చివరలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. నేషనల్ వైడ్‌గా షూటింగ్స్‌కు అనుమతులిస్తున్న క్రమంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ఈ షో.. ఇప్పటి వరకు ఎలిమినేట్ కాకుండా ఉన్న కంటెస్టెంట్లతో మళ్లీ స్టార్ట్ కానుంది. అయితే కొవిడ్-19 నేపథ్యంలో మొదట కరోనా పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌ పూర్తైన తర్వాతే హౌజ్‌లోకి అనుమతిస్తారు. దీనిపై మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనుండగా.. అటు మలయాళ బిగ్ బాస్ కూడా ఇదే పద్ధతి ఫాలో కాబోతుందని సమాచారం. ఫిబ్రవరిలో ఈ సీజన్ ప్రారంభం కాగా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed