- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్నడ నటుడు ఆత్మహత్య
కన్నడ సీరియల్ నటుడు సుశీల్ గౌడ.. ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక మాండ్యాలోని ఇందువాలులో ఉన్న తన నివాసంలో చనిపోయారు. మంగళవారం జరిగిన ఈ ఘటన శాండల్ వుడ్, టెలివిజన్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.
ఫిట్‌నెస్ ట్రైనర్, యాక్టర్ అయిన సుశీల్.. ప్రస్తుతం అంతపుర సీరియల్‌లో హీరోగా నటిస్తున్నారు. ఈ సీరియల్ భారీగా ప్రేక్షకాదరణ పొంది హిట్ కాగా.. కన్నడ మూవీ ‘సలాగ’లో ఇంపార్టెంట్ రోల్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సుశీల్.. చాలా సాఫ్ట్ పర్సన్ అని చెప్పారు ఆ సినిమా డైరెక్టర్ దునియా విజయ్. సుశీల్ కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని అనుకున్నాను.. కానీ ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందని ఆయన తెలిపారు. తన తొలి సినిమా విడుదలకు ముందే చనిపోవడం మరింత ఆవేదనకు గురిచేస్తోందని అన్నారు. ‘కేవలం 30 రోజుల పాటు షూటింగ్‌లో కలిసి పనిచేసిన తనకే ఇంత బాధగా ఉంటే.. 30 ఏళ్లు పెంచిన తల్లి దండ్రులకు ఇంకెంత బాధ ఉంటుందో’ అని విచారం వ్యక్తం చేశారు. చావే అన్ని సమస్యలకు పరిష్కారం కాదన్న డైరెక్టర్.. కరోనా మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోతున్న చాలా మంది ఇదే పని చేస్తున్నారని.. ఇప్పట్లో ఇలాంటి మరణాలు ఆగేలా లేవని బాధపడ్డారు.