జగన్ ఇప్పుడా మాట నిలబెట్టుకోవాలి: కన్నా

by srinivas |
జగన్ ఇప్పుడా మాట నిలబెట్టుకోవాలి: కన్నా
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ ఏపీలో పెను రాజకీయ దుమారం రేపింది. దీనిపై అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను ఉపేక్షించరాదని అన్నారు. అవినీతి ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి నేతల భరతం పడతామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడా మాట నిలబెట్టుకోవాలని కన్నా సూచించారు. ఇఎస్ఐ స్కాంతో పాటు, ప్రస్తుతం ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారిపైన కూడా కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story