- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరా గాంధీలా మారుతున్న వివాదాస్పద నటి.. 'ఎమర్జెన్సీ' అంటూ
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో బయోపిక్ కి సిద్ధమైంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ సై అని వివాస్పదమైన కంగనా ఇప్పుడు ఏకంగా భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ప్రకటించింది. ఇదివరకే ఈ వార్తలు గుప్పుమన్నా ఇప్పుడు కంగనానే అధికారికంగా ప్రకటించేసింది. ఇటీవలే ‘తలైవి’ సినిమాను పూర్తిచేసిన అమ్మడు ఇక ఇప్పటినుంచి ఇందిరా గాంధీ పాత్ర కోసం కష్టపడుతునట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.
ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్ పనులను మొదలుపెట్టిన కంగనా లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ చేయించుకుంటు కనిపించారు. అయితే ఇది ఇందిరమ్మ బయోపిక్ కాదని, ‘ఎమర్జెన్సీ’ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని ఆమె తెలిపారు. ఈ సినిమాకు ఎమర్జెన్సీ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఎప్పుడు వివాదాలతో కాపురం చేస్తుంటే ఈ ఫైర్ బ్రాండ్ ఈ ఎమర్జెన్సీ తో ఎన్ని వివాదాల్లో చిక్కుకొంటుందో చూడాలి. ప్రస్తుతం కంగనా ‘ధాకడ్’, ‘తేజస్’, ‘అపరాజిత అయోధ్య’ చిత్రాలలో నటిస్తుంది.