- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిచెస్ట్ పీపుల్ జాబితాలో నా పేరుండాలి : కంగనా
ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగింది కంగనా రనౌత్. ఇండస్ట్రీ లోపాలను ఎత్తి చూపడంలో కంగనా ఎప్పుడూ వెనకడుగు వేయని విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని కంగనా ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్ళను ఎదగనివ్వరని మండిపడ్డారు కూడా. ఇలా నిత్యం తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఈ ఫైర్‌బ్రాండ్ లేడీ.. తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను, డబ్బుల్లేక ఆమె పడ్డ ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
‘సంప్రదాయ, మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి ఇక్కడ అందరిలాగే గౌరవం, ప్రేమ దొరకదు. ఎందుకంటే.. ఇక్కడ నెపోటిజం ఎక్కువ. పరిశ్రమలో తనను ‘గోల్డ్ డిగ్గర్’ (డబ్బులు కోసం పురుషులతో సన్నిహితంగా ఉండటం) అనేవాళ్లు. అది వాస్తవం కాదని ఎలా నిరూపించాలో అర్థమయ్యేది కాదు. 50 ఏళ్లు వచ్చేసరికి ఎవరికీ లేనటువంటి ఖరీదైన ఇల్లు, ఆఫీస్ నిర్మించుకోవాలని, ఇండియాలో రిచెస్ట్ పీపుల్ జాబితాలో నా పేరు ఉండాలని ఆ రోజుల్లోనే డిసైడ్ అయ్యాను’ అని తెలిపింది కంగనా. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవార్డు ఫంక్షన్స్‌కు వెళ్లేందుకు తన దగ్గర ఖరీదైన డిజైనర్ దుస్తులు కూడా లేవన్న కంగనా.. గ్యాంగ్‌స్టర్ సినిమాకు గాను అవార్డు తీసుకునేందుకు ఎదురైన పరిస్థితిని చెప్పుకొచ్చింది. ఆ టైమ్‌లో ఫ్రెండ్, డిజైనర్ రిక్కిరాయ్ తనకు డ్రెస్ స్పాన్సర్ చేశాడని, అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానంటూ తన సినీ ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు కంగనా.