- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తలైవి’ కోసం కంగనా ‘భారీ’ తపన
పంగా’ సినిమాతో లేటెస్ట్‌గా హిట్ అందుకుంది కంగనా రనౌత్. ఇప్పుడు తమిళుల ఆరాధ్య నటి, దివంగత నేత జయలలిత బయోపిక్ ‘తలైవి’పైనే దృష్టి సారించింది. ఈ సినిమా కోసం కొన్ని వారాల్లోనే 10 కేజీల బరువు పెరిగిందట. ఇది ప్రొస్తెటిక్, సీజీ వర్క్ కాదని, కంగనా డెడికేషన్ లెవల్స్‌కు ఓ ఉదాహరణ అని తమిళ మీడియా ప్రశంసించింది. దీనిపై స్పందించిన కంగనా సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది.
కంగనా కొన్ని వారాల్లోనే 10 కేజీల బరువు పెరిగిందని తెలిపింది. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ బాగా పెరిగాయని చెప్పింది. కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని తెలిసినా ఇంత వెయిట్ గెయిన్ చేసేందుకు గట్స్ ఉండాలి అంది. అంతేకాదు ‘తను వెడ్స్ మను’ సినిమా షూటింగ్‌లో కంగనా బైక్ యాక్సిడెంట్‌కు గురైందని, ఆ సమయంలో కాలుకు 52 కుట్లు పడ్డాయని తెలిపింది. ‘మణికర్ణిక’ సినిమా షూటింగ్‌లో కో-యాక్టర్ యాక్సిడెంటల్‌గా కత్తితో కంగనా తలను కొట్టాడని, ఆ టైంలో తలకు 15 కుట్లు పడ్డాయని చెప్పింది. అయినా సినిమాలకు ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్‌లో పాల్గొందని వెల్లడించింది. సినిమాల కోసం తను పడుతున్న కష్టాన్ని గుర్తించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. తనకు నచ్చితే ఏ పాత్ర చేసేందుకైనా కంగనా రెడీగా ఉంటుందని, అందుకోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొంటుందని తెలిపింది కంగనా సోదరి.