- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ మీటింగ్ లో అపశ్రుతి.. ఎలక్షన్ కోడ్ వర్తించదా..!
దిశ, కోదాడ: కోదాడలో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మీటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. రైతుల ధర్నా కార్యక్రమం కోసం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా బంజార కాలనీకి చెందిన కందుకూరి సునీల్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందగా, కుడుముల వెంకటేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నాయకులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వైఖరికి సునీల్, వెంకటేష్ బంధువులు రంగా థియేటర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ఫ్లెక్సీలకు అనుమతి లేకుంటే ఈ ప్రమాదాలు జరిగేవి కాదని, నాయకుల ఒత్తిడితోనే మా కొడుకులు ఫ్లెక్సీలు కట్టాల్సి వచ్చిందని, తక్షణమే అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.
సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు కోదాడ పట్టణ టీఆర్ఎస్ నాయకులు స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వారి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సైతం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. దాంతో ఎట్టకేలకు మృతుడి బంధువులు ధర్నా విరమించారు.
ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వర్తించదా?
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఫ్లెక్సీలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఏమీ పట్టనట్టుగా మున్సిపల్ అధికారులు సైతం పట్టించుకోకుండా ఉండడం తో పట్టణంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలిశాయని విమర్శించారు. ఇతర పార్టీలకు వర్తించే ఎలక్షన్ కోడ్ అధికారపార్టీకి వర్తించదా అంటూ ప్రశ్నిస్తున్నారు.