'కాంచన-3' హీరోయిన్ ఆత్మహత్య.. హోటల్ గదిలో ఆ స్థితిలో దొరికిన మృతదేహం

by Anukaran |   ( Updated:2021-08-22 23:28:01.0  )
కాంచన-3 హీరోయిన్ ఆత్మహత్య.. హోటల్ గదిలో ఆ స్థితిలో దొరికిన మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి హోటల్ రూమ్ లో విగతజీవిగా పడి ఉండడం కలకలం రేపుతోంది. రాఘ‌వ లారెన్స్ న‌టించిన ‘కాంచ‌న 3’లో దెయ్యం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసిన అలెగ్జాండ్రా జావి గోవాలో తాను బస చేసిన హోటల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. అయితే ఆమె మరణానానికి కారణం ఆమె ప్రియుడితో విడిపోవడమేనని తెలుస్తోంది. గత కొన్నిరోజుల క్రితం అలెగ్జాండ్రా జావి తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయారని, అప్పటినుంచి ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిందని సమాచారం. ఆ బాధ తట్టుకోలేకే ఆమె గది పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఆత్మహత్యయేనా..? లేక ఎవరైనా హత్యా చేశారా..? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇకపోతే అలెగ్జాండ్రా జావి 2019 లో చెన్నై ఫోటోగ్రాఫర్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది. తన ఫొటోలని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ ఫోటోగ్రాఫర్‌ ని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక మెడికో ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ప్రతినిధులను నియమించడానికి దర్యాప్తు అధికారులు ఇప్పటికే రష్యన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. 24 ఏళ్ల వయసులోనే నటి మృతిచెందడం బాధాకరమని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed