మహిళలపై వివక్ష చూపొద్దు.. కలెక్టర్ జితేష్ పాటిల్ సూచన

by Shyam |
Kamareddy Collector
X

దిశ, కామారెడ్డి: మహిళలపై వివక్ష చూపొద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం స్త్రీలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్, సఖి కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రొత్సహించాలని అన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా పిల్లలను సమానంగా చూడాలని పెంచాలని సూచించారు. మహిళలు హింసకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

మహిళలకు స్వేచ్చ ఇస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని అన్నారు. అనంతరం షీ టీం పోస్టర్లను ఆవిష్కరించారు. క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. బాల్య వివాహాలు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అంశాలపై రాజంపేట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు నాటికలు వేశారు. విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, సీడబ్ల్యూసీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, బాల రక్షా భవన్ కో-ఆర్డినేటర్ జానకి, సీడీపీవోలు, అంగన్వాడీ కార్యకర్తలు, సఖి సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం సహకార అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేపట్టాలని తెలపారు. అనంతరం సహకార సంఘాల వారిగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం బస్తాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా.. జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు.

Advertisement

Next Story