- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కు.ని.కి ఒకరినైనా పట్టుకురండి.. లేదా ఉద్యోగం వదలండి’
మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కారు ఆగమేఘాల మీద మేల్ హెల్త్ స్టాఫ్‌కు విడుదల చేసిన సర్క్యూలర్ చర్చనీయాంశమైంది. మార్చి కల్లా ఒక్క పురుషుడినైనా కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్ కోసం పట్టుకురావాలని లేదంటే రిటైర్మెంట్(కంపల్సరీ రిటైర్మెంట్) తీసుకోవాలని సూచించింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో పురుషుల పార్టిసిపేషన్ పెంచాలని, 2019-20 కు.ని లక్ష్యాన్ని అందుకునేందుకు నేషనల్ హెల్త్ మిషన్.. రాష్ట్ర శాఖ ఫిబ్రవరి 11న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 కాలంలో ఒక్క పురుషుడినీ కు.ని ఆపరేషన్‌కు తీసుకురాలేకపోయిన మేల్ హెల్త్ స్టాఫ్ స్వచ్ఛందంగా వారి జీతాలనైనా వదులుకోవాలి లేదా రిటైర్‌మెంట్ అయినా తీసుకోవాలని సూచించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 0.5శాతం మంది పురుషులు మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సర్వేను నోట్ చేసుకుంటూ ఎన్‌హెచ్ఎం మిషన్ డైరెక్టర్.. ఈ ఏడాదిలో ఒక్క పురుషుడినీ ఆపరేషన్‌కు మోటివేట్ చేయలేని స్టాఫ్‌ను గుర్తించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొగ్రాం ప్రకారం.. ప్రతి హెల్త్ వర్కర్ ఏడాదికి ఐదు నుంచి పది మందికి స్టెరిలైజేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ‘ఈ సర్క్యూలర్ ఎవరినీ ఒత్తిడి పెట్టేందుకు కాదని ఎన్‌హెచ్ఎం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రగ్యా తివారీ తెలిపారు. సాధారణంగా చాలా మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు కానీ, సరైన అవగాహన లేకుండా చేసుకోరు. అటువంటి వారికి అవగాహన కల్పిస్తే చాలు.. ఇప్పుడు చెప్పేది కూడా అదే హెల్త వర్కర్లు తమ పనులను సక్రమంగా నిర్వర్తించాలన్నదే ఈ సర్క్యూలర్ ఉద్దేశమని తెలిపారు.