154 స్థానాల్లో కమల్ పార్టీ పోటీ

by Shamantha N |
154 స్థానాల్లో కమల్ పార్టీ పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో త్వరలో ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్‌హాసన్ కీలక ప్రకటన చేశారు. 154 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన కమల్.. ఇండియా జననాయక కచ్చి, ఆలిండియా సమతువా మక్కల్ కచ్చి పార్టీలతో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు పార్టీలకు చెరో 40 సీట్లు కేటాయించామన్నారు.

తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా.. డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీకి అన్నాడీఎంకే 25 సీట్లు కేటాయించగా.. కాంగ్రెస్‌కు డీఎంకే 34 సీట్ల కేటాయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో.. పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తుంది.

Advertisement

Next Story