- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kamal Haasan: నా ప్రాణం ఉన్నంతవరకు రాజకీయాల్లో ఉంటాను- కమల్ హాసన్
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్ష్యుడు కమల్ హాసన్ ఘోరంగా ఓడిపోయినా సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో కమల్ ఇకనుండి రాజకీయాలకు దూరంగా ఉంటారని, సినిమాలపై దృష్టిపెడతారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ సన్యాసంపై వస్తున్న వార్తలపై కమల్ తాజాగా స్పందించారు. తాను బ్రతికునంతవరకు రాజకీయాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో కమల్ ట్వీట్ చేశారు.
“என் உயிருள்ளவரை அரசியலில் இருப்பேன்; அரசியல் இருக்கும் வரை மக்கள் நீதி மய்யம் இருக்கும்” pic.twitter.com/RwAa9ykS71
— Kamal Haasan (@ikamalhaasan) May 24, 2021
” తన పార్టీ నుంచి ఎంతమంది బయటికి వెళ్లినా… తాను మాత్రం రాజకీయాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. పార్టీ కూటమి ఏర్పాటులో నోరుమెదపని వారందరు.. ఇప్పుడు తన రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతున్నారని, దాని కోసం కుంటిసాకులు చెప్తున్నారని కమల్ విమర్శించారు. పార్టీలో చాలామంది రాజకీయాలను వ్యాపార కోణంలో చూస్తున్నారు.. అలాంటివారే పార్టీని వీడి వెళ్లిపోతున్నారన్న కమల్ తానెప్పటికీ రాజకీయాలను వీడనని” తేల్చి చెప్పారు. అంతేకాకుండా కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదన్న కమల్ వారికెప్పుడు తాను అండగా ఉంటానని దైర్యం చెప్పారు. ఇక కమల్ క్లారిటీతో ఆయన రాజకీయ పయనం మీద వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే.