- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగా షోరూమ్‌లను ప్రారంభించనున్న కల్యాణ్ జ్యువెలర్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ తాజాగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సాం మొదటి త్రైమాసికంలో తన రిటైల్ దుకాణాలను దాదాపు 13 శాతం విస్తరించే ప్రణాళికలను సోమవారం ఆవిష్కరించింది. దేశీయంగా ఏడు రాష్ట్రాల్లో కార్యకలాపాలను మెరుగుపరచాలని భావిస్తున్నట్టు, వచ్చే నెల చివరి నాటికి 14 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
‘ టైర్1 నగరాల్లో ప్రస్తుతం ఉన్న కార్యకలాపాలను పెంచేందుకు బ్రాండ్ ప్రణాళికలను కలిగి ఉన్నామని, టైర్2, టైర్3 మార్కెట్లపై కూడా దృష్టి సారించనున్నట్టు, ఈ ప్రాంతాల్లో మిడ్-సైజ్ షోరూమ్‌లను విస్తరించనున్నట్టు’ కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. కల్యాణ్ జ్యువెలర్స్ ఇటీవల ఐపీఓ ద్వారా రూ. 1,175 కోట్లను సమీకరించింది. ఈ నిధుల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం మూలధన వృద్ధికి కేటాయించినట్టు కంపెనీ పేర్కొంది. దీనిద్వారా ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే మొదటి త్రైమాసికంలో రూ. 500 కోట్ల మూలధనాన్ని పెంచుతుందని తెలిపింది.
ప్రస్తుతం కల్యాణ్ జ్యుయలర్స్ దేశీయంగా మొత్తం 107, మధ్య ప్రాచ్యంలో 30 షోరూమ్‌లను కలిగి ఉంది. కొత్తగా ప్రారంభించబోయే వాటితో కలిపితే మొత్తం 151కి పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. ‘సంస్థ విస్తరణ ప్రణాళికలు, వ్యూహాల గురించిన మాట్లాడిన కల్యాణ్ జ్యువెలర్స్ ఛైర్మన్, ఎండీ టీఎస్ కల్యాణరామన్ మాట్లాడుతూ..వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కొత్తగా 14 ఔట్‌లెట్లతో తమ రిటైల్ ఉనికిని 13 శాతం విస్తరించబోతున్నాం. దీంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో తమ వినియోగదారుల భద్రతను కాపాడేందుకు తమ షోరూమ్‌లో కఠినమైన పరిశుభ్రత చర్యలను తీసుకున్నామని’ చెప్పారు.