నాన్న నమ్మకమే కానుక : కాజోల్

by Shyam |   ( Updated:2023-05-19 13:31:23.0  )
నాన్న నమ్మకమే కానుక : కాజోల్
X

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ తన సినిమాలతో ఒక ట్రెండ్ సృష్టించింది. షారుక్ ఖాన్‌కు రీల్ జోడీగా మెప్పించిన కాజోల్.. అజయ్ దేవగన్‌కు రియల్ జోడీగా సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం తన కూతురిని వెండితెరకు పరిచయం చేసేందుకు శిక్షణ స్టార్ట్ చేసిన కాజోల్.. ఎప్పటికప్పుడు కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. మరి హీరోయిన్‌గా రాణించాలని అనుకున్న తన కూతురిని తను నమ్మినప్పుడు.. తన తండ్రి తననెలా నమ్మాడనే విషయాన్ని వివరించింది.

తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని తనను నాన్న ఎలా? ఎంతలా? ప్రోత్సహించాడు అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తనను చూసినప్పుడు వాళ్ల నాన్న కళ్లు మెరిసిపోయేవని గుర్తుచేసుకుంది. ‘తను నన్ను చాలా నమ్మాడు.. నేను ఏదైనా చేయగలను అనే నమ్మకంతో ఉండేవాడు’ అని చెప్పింది. నేనిప్పుడు ఇలా ఉన్నానంటే నాన్నే కారణం అంటున్న కాజోల్.. ఈ నెల 21న ఫాదర్స్ డే పురస్కరించుకుని తండ్రులందరికీ అడ్వాన్స్ విషెస్ తెలియజేసింది. ఈ సందర్భంగా నాన్నలు కూతుళ్లను ఎలా చూసుకోవాలో సూచించింది. ‘మీ చిన్నారులకు నమ్మకం అనే కానుక ఇవ్వండి.. ఇది చాలా గొప్ప మ్యాజిక్ చేయగలదు. మీరు వారిపై ఉంచే నమ్మకమే వారిని ఉన్నతస్థాయిలో స్థిరపడేలా చేస్తుంది’ అని చెబుతోంది. సమాజం, కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని.. వారిలో ఆత్మ విశ్వాసం పెంచే శక్తిగా మారాలని కోరారు.

Advertisement

Next Story