పసుపు వర్ణంలో చందమామ హొయలు

by Shyam |
పసుపు వర్ణంలో చందమామ హొయలు
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తన మనసు గెలుచుకున్న గౌతమ్‌ కిచ్లును ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కాగా పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇదివరకే షేర్ చేసిన చందమామ.. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను పంచుకుంది. అంతేకాదు ఆ ఔట్‌ఫిట్‌ను డిజైన్ చేసిన ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రకు ప్రత్యేక అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలిపింది.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ ఫంక్షన్‌లో పసుపువర్ణపు దుస్తుల్లో మెరిసిపోయిన కాజల్.. తన ఎంగేజ్‌మెంట్ రోజున కూడా పసుపు కాంతులీనుతున్న చీరలో ఒదిగిపోయింది. ‘మనీష్ మల్హోత్ర అండ్ టీమ్.. మీరు నాకోసం రూపొందించిన ఈ శారీ ఎంతో అద్భుతంగా ఉంది. లాక్‌డౌన్ వేళ.. అసలు ఏ పని కూడా సాధ్యపడని టైమ్‌లో మీరు ఎంతో కష్టపడ్డారు. మీ ఎఫర్ట్, హార్డ్ వర్క్‌ను నేను అభినందిస్తున్నాను. నా ఎంగేజ్‌మెంట్‌లో మీరు భాగమైనందుకు సంతోషం. లాట్స్ ఆఫ్ లవ్’ అని కాజల్ మనీష్ మల్హోత్ర రూపొందించిన చీరను కట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు తన ఎంగేజ్‌మెంట్ సందర్భంగా గౌతమ్ కిచ్లుతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది చందమామ. ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

మరోవైపు ఆదివారం కాజల్‌ తన పెళ్ళికి ముస్తాబైన ఫొటోలను పంచుకుంది. మ్యారేజ్‌లో కాజల్ భారీ ఎంబ్రాయిడరీ లెహెంగాలో మెరిసిపోగా.. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించారు.

Advertisement

Next Story