- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చందమామ’ గుండె పగిలిన సంఘటన
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ను ఒక సంఘటన ఎంతగానో కదిలించిందట. సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే ఆమె తాజాగా ఓ నిజజీవిత సంఘటన అభిమానులతో షేర్ చేసుకుంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తన అభిమానులకు, ఫాలోవర్స్, నెటిజన్స్ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పినా ఆమె, కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. వైరస్ వల్ల ఓ క్యాబ్ డ్రైవర్ కష్టపడుతున్నాడని, ఇది తెలిసిన తర్వాత తన గుండె పగిలిందని అన్నారు.
వైరస్ వల్ల ఓ క్యాబ్ డ్రైవర్ పడుతున్న కష్టాన్ని చూసి తనకు చాలాబాధ కలిగిందని చెప్పింది చందమామ. ‘క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని ఏడ్చాడు. రెండు రోజులుగా తానే మొదటి కస్టమర్ అన్నాడు. కనీసం ఇవాళ అయినా నేను సరుకులు తీసుకెళ్తానని నా భార్య అనుకుంటుందని అన్నాడు’ అని కాజల్ తెలిపింది. గత కస్టమర్ వదిలిపెట్టాక దాదాపు 70కి.మీ. ఖాళీగానే తాను డ్రైవింగ్ కూడా చేశాడని చెప్పింది. అయితే.. అతడి కష్టం చూసి చలించిపోయిన ముద్దుగుమ్మ…. క్యాబ్ డ్రైవర్‌కు రూ. 500 ఎక్కువగా ఇచ్చింది.
వైరస్ ఎంతోమందిని ఇబ్బందులు పెడుతోంది
‘‘ఈ వైరస్ మనల్ని అనేక విధాలుగా దెబ్బతీస్తోంది. కానీ, రోజువారీ ఆదాయం మీద జీవితం గడిపేవాళ్లు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతడికి రూ.500 ఎక్కువగా ఇచ్చాను. మనలోని చాలామందికి ఇలా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. దయచేసి క్యాబ్ డ్రైవర్లకు, చిన్న దుకాణాలు పెట్టుకుని ఉన్నవారికి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజుకి మీరే వాళ్ల చివరి కస్టమర్ కావొచ్చు’’ అంటూ కాజల్ తన ఇన్స్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే కాజల్ చేసిన పోస్టుకు ఆమె అభిమానులు లైకులు కొడుతున్నారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
tags :kajal aggarwal, insta, social media, cab driver, caronna ,